MadhuPriya Bathukamma Song 2023 Lyrics – Kamal Eslavath
Singer | Kamal Eslavath |
Composer | Madhuppriya |
Music | Madeen Sk |
Song Writer | Madeen Sk |
MadhuPriya Bathukamma Song 2023 Lyrics
పూలటేరు మీద ఊరూర చేరినావే
పసుపూ పారాణితో బంగారు గౌరమ్మవై
తీరుపూల నడుమ ఇగురంగ పేర్చినామె
దీపమై నడపవే మా బతుకును బతుకమ్మవై
గునుగుపూల గుత్తులు గుంపుగ పూసినయో
తంగేడు తలలే తెంపుకుపొమ్మందో
అల్లిపూలు కళ్ళుతెరిచె
తామరలే ఒళ్ళు విరిచె
తల్లీ నీ పల్లకి అవగా ఆ ఆ ఆ ఆ
ఏ, తల్లి నీ సుట్టూర
తలసి తలసి పాడేము
అక్కలు సెల్లెలమంతా
హారతులే పట్టేము
మళ్ళీ నిన్ను మనసారా
కొలిసి కొలిసి ఆడేము
పట్టరాని ఆనందంలో
పరవశించి పోయేము
తల్లి నీ సుట్టూర
తలసి తలసి పాడేము
అక్కలు సెల్లెల్లంతా
హారతులే పట్టేరు
మళ్ళీ నిన్ను మనసారా
కొలిసి కొలిసి ఆడేము
పట్టరాని ఆనందంలో
పరవశించి పోయేము
పచ్చి పసుపుకొమ్ము తెచ్చి
వనారమ్మ వనారే
పూయగానే గడపమెచ్చే
వనారమ్మ వనారే
బంధాల శ్రీగంధం
వనారమ్మ వనారే
గదువలకే అందమిచ్చె
వనారమ్మ వనారే
ఎంగిలి పూవుల్లో
ఇలను చేరిన గౌరమ్మకు
అటుకుల బియ్యం ముద్ద
పప్పుల నైవేధ్యము
వేపకాయ వెన్నముద్ద
అలిగిన బతుకమ్మకు
కలిగినంత వండిపెట్టె
సద్దుల వంటకమూ
డప్పులు గొప్పగ మోగే
దారి పొడుగునా
ఈరోజు కొరకే చూస్తిమె
ఏడాది పొడవునా
పుట్లకొద్ది పూలు కోసి
మెట్ల తీరు మలిసి నిన్ను
గౌరమ్మగ నిలుపుకొంటిమే ఏ ఏ ఏ ఏ
ఏ, తల్లి నీ సుట్టూర
తలసి తలసి పాడేము
అక్కలు సెల్లెలమంతా
హారతులే పట్టేము
మళ్ళీ నిన్ను మనసారా
కొలిసి కొలిసి ఆడేము
పట్టరాని ఆనందంలో
పరవశించి పోయేము
పట్టపగలు కాసే
పున్నమి పూల చందము
పట్టా పగ్గము లేని
పడతుల సంబరమూ
కట్టు తెంచుకొని పూసే
కట్ల పూల అందము
చుట్టు ఆడపట్టు అంతా
ఒక్కటైన బంధమూ
తల్లులెంబడే పల్లె రాగమెత్తెను
పిల్ల జెల్ల పల్లవులై గొంతు కలిపెను
కొత్త పట్టు బట్ట గట్టి
బుట్టబొమ్మ నిన్ను ఎత్తి
ఊరువాడ చెరువు చేరెనో ఓ ఓ ఓ ఓ
ఏ ఏ ఏ ఏ, తల్లి నీ సుట్టూర
తలసి తలసి పాడేము
అక్కలు సెల్లెలమంతా
హారతులే పట్టేము
మళ్ళీ నిన్ను మనసారా
కొలిసి కొలిసి ఆడేము
పట్టరాని ఆనందంల
పరవశించి పోయేము
సెరువు కట్ట సేరదీసె
వనారమ్మ వనారే
ఊరువాడ ఆడి పాడె
వనారమ్మ వనారే
గౌరమ్మ కొలువుదీరె
వనారమ్మ వనారే
గంగమ్మ ఒడ్డు జేరి
వనారమ్మ వనారే